logo

అనంతగిరి: అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ ఈ నెల 23 వరకు పొడిగింపు

అన్నదాత సుఖీభవ పథకం గ్రీవెన్స్ గడువు పొడిగించినట్లు అనంతగిరి ఏఓ రంగరావు ఆదివారం తెలిపారు. అర్హత ఉండి అన్నదాత సుఖీభవ అర్హుల లిస్ట్ లో పేరు లేని రైతులు ఆర్జీలు పెట్టుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 23 వరకు అవకాశం ఇచ్చారని ఏఓ అన్నారు. దీని కొరకు రైతులు తమ భూమి పట్టా / ఆర్ఓఎఫ్ఆర్ పట్టా మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ లతో ఆర్జీలను తమ రైతు సేవా కేంద్రాల్లోని విఏఏ/విహెచ్ఏ లకు అందించాలని ఆయన పేర్కొన్నారు.

0
0 views