గ్రామదేవతలకు ఆషాఢ మాస పూజా సమాగ్రి చీర పంపిణీ
కొడిమ్యాల, జూలై 19:సూర్యోదయం ప్రతినిధి.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం మరియు ఏడేల్లి పోచమ్మ దేవాలయాలకు ఆషాఢ మాసం సందర్భంగా చీరలు, ఒడి బియ్యం,పూజా సామాగ్రి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు మరియు కొండగట్టు గిరి ప్రదక్షణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆదేశాలతో,దాతల సహకారంతో నిర్వహించారు.ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అయోధ్య సభ్యులు,కొండగట్టు గిరి ప్రదక్షిణ సభ్యులు ఆలయ కమిటీకి,పూజారులకు పూజా సామాగ్రి చీర అందజేశారు.ఈ కార్యక్రమంలో.మంచాల శ్రీనివాస్,ఎ.ఆదిరెడ్డి.కంచర్ల రామస్వామి,బాలే గణేష్,ముమ్మాడి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.పెద్దమ్మ తల్లి దేవాలయం పూజారి కమిటీ బల్ల అంజయ్య,కులస్తులు పిట్టల శ్రీనివాస్,బల్ల ఎల్లయ్య గ్రామ భక్తులు.ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.కార్యక్రమం శ్రద్ధా భక్తులతో ఘనంగా నిర్వహించబడింది.