logo

మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం:

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివారం అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.పాలన మరచి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే లేని లిక్కర్‌ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారని, ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ శునకానందం పొందుతున్నారని, రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు.

15
77 views