
సవాళ్లన్నీ ఛాలెంజ్ లే
(మొదటి పేజీ తరువాయి)
కూడా సాధ్యమైనంత తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, దోషులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు న్యాయం చేకూర్చాలి. అప్పుడే ఇన్వెస్టిగేషన్ సార్ధకత చేకూరుతుంది.
సవాళ్లన్నీ ఛాలెంజ్ లే
(మొదటి పేజీ తరువాయి)
కూడా సాధ్యమైనంత తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, దోషులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు న్యాయం చేకూర్చాలి. అప్పుడే ఇన్వెస్టిగేషన్ సార్ధకత చేకూరుతుంది.
శాంతి భద్రతలు....
జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా మత,కుల ప్రాతిపదికన అదేవిధంగా ఫ్యాక్షన్ గ్రామాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని, ఎక్కడ కూడా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడడమే పోలీస్ ప్రధాన కర్తవ్యం.మూడవదిగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గి, మరణాల సంఖ్యబాగా తగ్గింది. ముఖ్యంగా మహిళలు, పిల్లల పైన జరుగుతున్న దాడులు పట్ల ఫిర్యాదులు అధికమయ్యాయి. ఫిర్యాదులు అధికంగా రావడం అంటే పోలీస్ పనితీరు మెరుగుపరచ డమేది కారణంగా చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో మహిళల కిడ్నాప్, వేధింపులకు సంబంధించిన కేసులు చాలావరకు తగ్గాయి. ఇక ఎస్సీ, ఎస్టీల పై దాడులు.. ప్రతినెల ఈ అంశంపై మారుమూల ప్రాంతాలైన గ్రామాలు, తండాలలో అవగాహన
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక గంజాయి విషయానికి వస్తే...
ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఈగల్ టీం ఇందుకోసం ప్రత్యే కంగా పనిచేస్తోందన్నారు. ఇందుకోసం ప్రత్యే కంగా ఒక సీఐని కేటాయించి. డి.ఎస్.పి చే మాని టరింగ్ చేసే విధంగా చేశామన్నారు. హిందూ పురం ప్రాంతంలో ఇప్పటివరకు 30 మందిని గంజాయి నిందితులను అరెస్టు చేయడం జరి గింది. అంతేకాకుండా వారిపై ఇప్పటికి ప్రత్యే కంగా నిఘా అనేది కొనసా గిస్తున్నాం. చిలమ త్తూరు సంఘటన అనంతరం హిందూపూర్ ప్రాంతంలో శాంతి భద్ర తలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. 300 కిలోమీటర్లు కర్ణాటక బార్డర్ శ్రీ సత్యసాయి జిల్లాకు ఉంది. 16 పోలీస్ స్టేషన్లు బోర్డర్లో ఉన్నాయి. అంతేకాకుండా తుంకూరు, చిత్రదుర బాగేపల్లి ప్రాంతాలు జిల్లాకు సరిహద్దుగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ నేరస్తులు ఎక్కువగా ఎస్కేప్ కావడం కోసం మన బార్డర్ లోకి రావడం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్ పోస్ట్ లను గుర్తించి ఆరు సీసీకెమెరాలు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా అదనంగా మరో 6 చెక్ పోస్టులు ఏర్పాటుచేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
LEX
ఎస్పీ రత్న
ఇంకా ఐదు సబ్ డివిజన్ల కు గాను 10 కమాండ్ కంట్రోల్ లు ఉన్నాయి. మడకశిరలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 150 కెమెరాలతో త్వరలో కదిరిలో కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నాం. హిందూ పురంలో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. త్వరలో పుట్టపర్తిలో సాయిబాబా శతజ యంతి ఉత్సవాల నేపథ్యంలో భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వారంలో మొత్తం కంట్రోల్ కమాండ్ అంతా కూడా పుట్టపర్తి నుంచి కమాండ్ చేయడానికి కృషి చేస్తున్నాం.. ఇదివరకు అనంతపురం, విజయవాడ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇకనుంచి ఇక్కడినుంచే కమాండ్ కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు డ్రోన్ విధానంలో 7 డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో 20 వరకు డ్రోన్లు ఏర్పాటుకు
శక్తి యాప్ గురించి లైంగిక వేధింపుల గురించి మహిళలకు విద్యార్థులకు వివరిస్తున్న ఎస్పీ
కృషి చేస్తున్నాం. కనీసం 15 డ్రోన్లు అవసరం అనేది గుర్తించాం. ఐదు సబ్ డివిజన్లకు రెండు చొప చ్చిన కేటాయిస్తే, తక్కిన ఐదు పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో పెట్టుకొని పర్య వేక్షించేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం ప్రైవేట్ వ్యక్తుల సహకారం సైతం తీసుకోవడం జరుగుతోందని ఎస్సీ తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పా టుకు రాష్ట్ర హోం మంత్రి వెలగపూడి అనిత చెప్పడం జరిగిందని, ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాకు సంబం ధించి 3000 సీసీ కెమెరాలు ప్రయత్నిస్తున్నామని ఎస్.పి తెలిపారు. ఇప్పటికే 2700 సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చివరిగా దొంగతనా లకు సంబంధించి ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జరిగిన నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ప్రధానంగా డ్రోన్స్ ద్వారా ఓపెన్ డ్రింకింగ్, పేకాట ఇతర నేరాలపై
పట్టు సాధించాం.ఇదే సందర్భంలో స్థానికంగా శాఖ పరమైన బదిలీల విషయంలో కఠినంగా వ్యవహరించి, అన్ని స్థాయి లలో బదిలీలు చేశాం. దీనివలన రాజకీయ ఒత్తిళ్లు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా అనుకు న్నది అనుకున్నట్లుగా మార్పులు చేశాం. 40 శాతం క్రైమ్ శాతాన్ని తగ్గిం చిన ఏడు జిల్లాలలో రాష్ట్రంలో శ్రీ సత్య సాయి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. కమ్యూనిటీ పోలీ సింగ్ విధా నంలో రాష్ట్ర అవార్డు అందుకున్న ఏకై కజిల్లా శ్రీసత్యసాయి జిల్లా. ఇదంతా కూడా రాష్ట్ర స్థాయిలో అధికారులకు తెలుసు. కానీ రికార్డులు, ప్రశంసలు వచ్చిన కారణంగా ప్రొఫెషనల్ జలసీ తో కొంత మంది చేస్తున్న. విమర్శలు, ఆరోపణలు గాని పట్టించుకోనని, తాను అనుకు న్నది నెరవె ర్చడం, సాధించడం కోసమే పని చేస్తానన్నానని ఎస్పీ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఈ విష యంలో తాను ఏమి చేతులు కట్టుకొని, కూర్చో వడం లేదని, జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర స్థాయిలో అధికారులు దృష్టికి తీసుకెళ్లి వివరించ డం జరుగుతోందని ఎస్పీ పేర్కొన్నారు. ఇలా ఏడాది కాలంలో ఎదురైన సవాళ్లు అన్నింటిని చాలెంజ్ గా తీసుకొని పనిచేసిన జిల్లా ఎస్పీ వి రత్న రాబోయే రోజుల్లో జరగనున్న వినాయక నిమజ్జనం వేడుకలు, భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ప్రతిష్టాత్మ కంగా తీసుకొని, పటిష్టమైన బందోబస్తు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
20/07/2025 | Ananthapur |