బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
అచ్చంపేట, జూలై 19,: నాగర్ కర్నూల్ పట్టణం లోని వెనుక బడిన వసతి గృహాల బిసి బాలికల కళాశాల వసతిగృహాన్నిజిల్లా కలెక్టర్ బా దావత్.సంతోష్ శనివారంసాయంత్రం ఆకస్మికంగా తనిఖీచేశారు.విద్యార్థినులతో మాట్లాడి, వారికి అందుతున్న వసతి సౌకర్యాలు,భోజనంనాణ్యతను గురించిఅడిగి తెలుసుకున్నారు.
మీహాస్టల్లోఎటువంటి సౌకర్యాలు, సమస్యలు ఉన్నా
తనదృష్టితీసుకురావచ్చని కలెక్టర్ తెలిపారు.
వసతి గృహం లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వసతి గృహంలో 60 మంది విద్యార్థినీలు ఇంటర్మీడియట్, డిగ్రీ విద్య నభ్య సిస్తూ వసతి గృహం లో ఉంటున్న విద్యార్థినీల వివరాలు అందుతున్న వసతులపై ఆరా తీశారు.
విద్యార్థినిలు కలెక్టర్ దృష్టికి తెచ్చిన సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ త్వరగా వాటిని మరమ్మతు చేయిస్తామని చెప్పారు.
విద్యార్థినిలు చదువుకొని ఉన్నత స్థితిలోకి రావాలని విద్య ఉంటేనే భవిష్యత్తు లో అన్ని పనులు, ఉద్యోగాలు మన దగ్గరికి వస్తాయని ఆయనసూచించారు.