logo

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తో ఎపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ భేటీ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తో ఎపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ భేటీ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ఢిల్లీ లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారి తో బిజెపి ఎపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈరోజు భేటీ అయ్యారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా పివిఎన్ మాధవ్ భాద్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నడ్డాగారితో మర్యాద పూర్వకంగా కలిసారు
ఈసందర్భంగా పార్టీ సంస్ధాగత నిర్మాణం తదితర అంశాలపై ఇరువురు మద్య ప్రస్తావన కు వచ్చింది
క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టం చేయడం తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి పటిష్టంగా ప్రజల ముందుకు వెళ్ళడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
ఎపి అభివృద్ధి కి కూటమి సర్కారు నిరంతరం శ్రమిస్తున్న విషయాలు ప్రజల్లో కి తీసుకొని వెళ్ళాలి అనే అంశంపై దిశానిర్దేశం చేశారు జెపి నడ్డా.
సమిష్టి కృషి తో పార్టీ ని మరింత పటిష్టం చేస్తానని మాధవ్ ఈసందర్భంగా పేర్కొన్నారు.

27
111 views