అటవీ శాఖ కార్యాలయంలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమం
విజయనగరం జిల్లా అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు డీఎఫ్ఓ కొండల రావు మాట్లాడుతూ.. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలను వివరించి, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచించారు. అటవీశాఖ కార్యాలయ ఆవరణలో చెత్తను శుభ్రం చేశారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అటవీ రేంజ్ అధికారులు శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.