విశాఖపట్నం జిల్లా, పోలీస్ శాఖ కు AM&NL సంస్థ..అదునాతన మోటర్ సైకిల్ పంపిణి..!!!
*పత్రిక ప్రకటన* *విశాఖపట్నం సిటీ**తేదీ : 19-07-2025* విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ నందు నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో ఇటీవల సమూల మార్పులు చేపట్టడం జరుగుతోంది. దీనిలో భాగంగా విశాఖ నగర పోలీసు లకు Arcelor Mittal & Nippon Steels (Pvt) Limited వారు (CSR) కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 25 అధునాతన మోటార్ సైకిళ్ళను (హోండా షైన్ 125 CC ) ఈ రోజు అనగా తే. 19-07-2025 ది. నాడు శ్రీ M.N. హరేంధిర ప్రసాద్,ఐ.ఎ.ఎస్., గారు, జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, విశాఖపట్నం వారి చేతుల మీదుగా విశాఖ నగర పోలీసులకు పంపిణి చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళ యొక్క ఫీచర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.◼️ హోండా షైన్ 125 CC◼️వాహన వెనుక భాగంలో హెచ్చరిక లైట్.◼️ఎరుపు / నీలం రంగు తో మెరిసే పోలీస్ బీకాన్ స్పీకర్.◼️సైరన్.◼️విండ్ స్క్రీన్, ◼️ప్రధమ చికిత్స కిట్ Bbఇదే విధంగా 2024 సంవత్సరంలో Arcelor Mittal & Nippon Steels (Pvt) Limited వారు 32 మోటార్ సైకిళ్ళ ను విశాఖ నగర పోలీస్ వారికి అందజేయడం జరిగింది. వారికి విశాఖ నగర పోలీసులు తరపున నగర పోలీసు కమీషనర్ ధన్యవాదములు తెలియచేస్తున్నారు. నగర పోలీసు తరపున, విశాఖపట్నం సిటీ.