logo

విశాఖపట్నం జిల్లా, పోలీస్ శాఖ కు AM&NL సంస్థ..అదునాతన మోటర్ సైకిల్ పంపిణి..!!!

*పత్రిక ప్రకటన*
*విశాఖపట్నం సిటీ*
*తేదీ : 19-07-2025*

విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ నందు నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో ఇటీవల సమూల మార్పులు చేపట్టడం జరుగుతోంది.

దీనిలో భాగంగా విశాఖ నగర పోలీసు లకు Arcelor Mittal & Nippon Steels (Pvt) Limited వారు (CSR) కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 25 అధునాతన మోటార్ సైకిళ్ళను (హోండా షైన్ 125 CC ) ఈ రోజు అనగా తే. 19-07-2025 ది. నాడు శ్రీ M.N. హరేంధిర ప్రసాద్,ఐ.ఎ.ఎస్., గారు, జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, విశాఖపట్నం వారి చేతుల మీదుగా విశాఖ నగర పోలీసులకు పంపిణి చేయడం జరిగింది.

ఈ మోటార్ సైకిళ్ళ యొక్క ఫీచర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
◼️ హోండా షైన్ 125 CC
◼️వాహన వెనుక భాగంలో హెచ్చరిక లైట్.
◼️ఎరుపు / నీలం రంగు తో మెరిసే పోలీస్ బీకాన్ స్పీకర్.
◼️సైరన్.
◼️విండ్ స్క్రీన్,
◼️ప్రధమ చికిత్స కిట్

Bbఇదే విధంగా 2024 సంవత్సరంలో Arcelor Mittal & Nippon Steels (Pvt) Limited వారు 32 మోటార్ సైకిళ్ళ ను విశాఖ నగర పోలీస్ వారికి అందజేయడం జరిగింది. వారికి విశాఖ నగర పోలీసులు తరపున నగర పోలీసు కమీషనర్ ధన్యవాదములు తెలియచేస్తున్నారు.


నగర పోలీసు తరపున,
విశాఖపట్నం సిటీ.

17
6537 views