logo

అన్నా బాహు సాఠే 56వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహణ.

అదిలాబాద్‌: ఈరోజు డాక్టర్ సాహిత్య రత్న, సాహిత్య సామ్రాట్ అన్నా భావు సాటే గారి 56వ వర్ధంతిని పురస్కరించుకుని అదిలాబాద్‌లోని అన్నా బాహు సాటే చౌక్ వద్ద అన్నా భావు సాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలు ఐక్యంగా పాల్గొని, పెద్దలు–చిన్నలు కలిసి పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించారు.
అన్నా భావు సాటే జీవితం, రచనలు, సామాజిక ఉద్యమాల పట్ల ఆయన నిబద్ధతను గుర్తు చేసుకుంటూ పలువురు మాట్లాడారు. ఆయన ఆశయాలను, సాహిత్య వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయాలనే సంకల్పంతో యువత ముందుండి పని చేయాలని కోరారు.

5
201 views