
ఖంపూర్ గ్రామంలో సాహిత్య సామ్రాట్ ప్రజా కవి "అన్నా బావు సాఠే" గారికి ఘన నివాళి.
ఈరోజు నార్నూర్ మండల కేంద్రంలోని ఖంపూర్ గ్రామంలో సాహిత్య సామ్రాట్ లోక్షహిర్ అన్నా బావు సాఠే గారి 56వ వర్ధంతి దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దళిత హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు జాదవ్ శేఖర్ మాట్లాడుతూ శ్రామికుల గురించి ప్రత్యేకంగా ఆలోచించి తన సాహిత్యం ద్వారా కూలి శ్రామికులు ఆకలితో ఉన్నవారికి ఏ విధంగా ఆదుకోవాలి తన పదంలోనే తన వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వాలకు మరి సమాజానికి చైతన్యం చేసిన వారు ఇలాంటి మహన్న నాయకుడు మా సమాజంలో జన్మించడం అంటే గొప్ప చరిత్ర మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో రష్యా దేశంలో అయినా యొక్క చరిత్ర ఇప్పుడు కూడా ఉన్నది అంతా చరిత్ర ఉన్నటువంటి మహా నాయకుడు మన సమాజంలో పుట్టడం అంటే ప్రతి ఒక్కరు ఆదర్శం తీసుకొని ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన బాటలు నడవాలని కోరుకున్నారు సమాజంలో యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత విద్య ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే దిశగా ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవీందర్ రాథోడ్ ఉపాధ్యాయులు సురేందర్ జాదవ్ గ్రామ పెద్దలు మారుతి వాగు మారే జాదవ్ సంజీవ్ గేరే లక్ష్మణ్ డాక్టర్ దాసరి గోపీనాథ్ అంబాదాసు జాదవ్ కేర్బ నాందేవ్ వాగమరే సురేష్ గ్రామపంచాయతీ కార్యదర్శి నాగో హెల్పర్ కైలాస్ రాజ్పాంగి అమృత్ దోండిబా మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.