logo

నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు! .. గువ్వల శ్రీకాంత్ రెడ్డి

యస్.టి.డి.న్యూస్: వైఎస్ఆర్సిపి నియోజకవర్గంలోని 6 మండలాల మండల కన్వీనర్లు బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నియోజవర్గ వైసిపి పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శింగణమల నియోజకవర్గంలో ఏ రాజ్యాంగం పని చేస్తుందో తెలియడం లేదు? విధుల్లోకి జాయిన్ కాకముందే ఎమ్మెల్యే ను వెళ్లి కలవండి అని చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డ వైసీపీ మండల కన్వీనర్లు.. బదిలీలపై వచ్చిన సచివాలయల ఉద్యోగులను విధుల్లోకి జాయిన్ అవ్వాలంటే ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్లి కలవాలంటూ హుకుం... జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ మండిపడ్డారు.

0
0 views