logo

అరకు: నేటి నుండి ఐదు రోజులు పోస్టల్ సేవలకు అంతరాయం

పోస్టాఫీసు సేవలకు ఈ నెల 18 నుండి 22 వరకు అంతరాయం కలుగుతుందని అరకు సబ్ డివిజన్ పోస్టల్ ఇనస్పెక్టర్ లక్ష్మి కిషోర్ గురువారం తెలిపారు. ఐటీ 2.O రోల్ అవుట్ కారణంగా రేపటి నుండి ఐదు రోజులు పోస్టాఫీసులో ఎటువంటి ఆర్ధిక, సేవా పరమైన బుకింగ్ లావాదేవీలు జరగవని పేర్కొన్నారు. కావున అరకు సబ్ డివిజన్ పరిదిలోని అరకులోయ, డుంబ్రిగుడ, పెదబయలు, ముంచింగిపుట్టు ప్రజలు గమనించి, సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.

0
0 views