
నిక్కచ్చికత కు, నైతిక విలువలకు టియూడబ్య్లూజె పని చేస్తుంది.
టియూడబ్య్లూజె(ఐజెయూ) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాటి మధు గౌడ్
నిక్కచ్చికతకు, నైతిక విలువలకు టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) సంఘం పనిచేస్తుందని టి యు డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధుగౌడ్ అన్నారు.అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర పుణ్యక్షేత్రమైన ఆలయ ప్రాంగణంలో నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీ మొదటి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పి విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశ కార్యదర్శి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, జర్నలిస్టుల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీలేని పోరాటం చేస్తుందని, ఏ ప్రభుత్వానికి వత్తాసు పలకబోదని అన్నారు. నైతిక విలువలతో కూడిన జర్నలిజం కావాలనుకునేవారు అది రాజకీయ పార్టీలకైనా,ఇతరులకైనా ఐజేయు అవసరం ఉంటుంది తప్పా,ఏ రాజకీయ పార్టీ కొమ్ముకాసే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటు అయిన జిల్లా కమిటీ నియోజకవర్గాలవారీగా జర్నలిస్టులకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు పి విజయకుమార్ మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి సమస్యల పరిష్కారానికి ప్రతి సభ్యుడు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ యూనియన్ పటిష్టత విషయంలో, సమస్యల పరిష్కార విషయంలో జర్నలిస్టులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా మాజీ అధ్యక్షులు గోలి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ పటిష్టత ఒక అధ్యక్ష కార్యదర్శులదే కాదని ప్రతి ఒక్కరు సహకారం అవసరమని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కొత్త కార్యవర్గం యూనియన్ భవనం కోసం కృషి చేయాలని పలువురు వక్తలు కోరారు. ఈ సమావేశంలో మొత్తం పది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో నాగర్ కర్నూల్ జిల్లా లోని ఉమామహేశ్వర క్షేత్రం తో పాటు అన్ని ప్రధాన ఆలయాల్లో ఉమ్మడి జిల్లా లో ఉన్న గుర్తింపు కలిగిన జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత ప్రత్యేక దర్శనం కల్పించాలని ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు లకు వినతి పత్రం అందజేశారు. నల్లమల్ల ఫారెస్ట్ లో గల అన్ని చెక్ పోస్టులలో ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టులకు టోల్ టాక్స్ ను మినహాయించాలని జిల్లా అటవీశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కర్ణయ్య,జిల్లా నాయకులు ,కార్యవర్గ సభ్యులు, మూడు నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.