logo

ప్రభుత్వ భూమి, కబ్జా స్థలాలను కాపాడాలని ఆర్ డీ ఓ కు వినతి పత్రం అందజేత





నాగర్ కర్నూల్, జూలై 15(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటపట్టణంలోని 293 సర్వే నంబర్‌లో గల 4.32 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడి,తిరిగిప్రభుత్వ,భూమిగాగుర్తించాలనిడిమాండ్ చేస్తూ భారతీయ జనతాపార్టీ(బీజేపీ)ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ మాధవికి వినతిపత్రంసమర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంగ్యా నాయక్,మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిని యూసుఫ్ అనే వ్యక్తి పేరు మీద ఎలా పట్టా చేశారని నేతలు ప్రశ్నించారు. యూసుఫ్ నిజంగా ఆర్మీలో పనిచేశారా లేదాఅనేవిషయంపై ఎంఆర్‌ఓ ద్వారా విచారణజరిపించాలనిఆయనడిమాండ్ చేశారు. ప్లాట్లు కొనుగోలు చేసే వినియోగదారులు మోసపోకుండా చూడాల్సినబాధ్యత రెవెన్యూ అధికారులపైఉందని మంగ్యానాయక్, గుర్తుచేశారు.అదేవిధంగా అచ్చంపేట పట్టణం గ్రామ పంచాయితీ ఉన్నప్పుడు స్ధానిక రెవెన్యు కార్యాలయం ఎదురుగా ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని, నిజాం కాలం నుంచి ప్రభుత్వ భూమి గా రెవెన్యు రికార్డులలో ఉందని పట్టణం లోని చరిత్ర తెలిసిన వారెవరైనా చెప్తారని, మల్లం కుంట లో కూడా ప్రభుత్వ భూమి లో కుంట ఆయకట్టు భూమి లో అక్రమ నిర్మాణాలు చేసిన అద్దెకు నడుపుతున్నారు.ఆ కుంట కింద చేపలు పట్టేవారు ఈ స్థలం పై న్యాయం కొరకు కోర్టుకువెళ్లారు.కేసు క్లియర్ అయ్యేవరకు ఎవరు వాడకూడదు అని మునిసిపల్ ఉన్నత స్థాయి అధికారులు చెప్పడం తో స్థలంలో నిర్మించిన షట్టర్లు డోజర్లతో తొలగించి షట్టర్ల స్థలం లో అడ్డంగా రేకులు పెట్టీ అక్కడ షాపులు నిర్వహించే వారు అద్దెకు తీసుకుని స్టోర్ రూమ్లు గా వాడుకుంటున్నారని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. బినామీగా ఒక ప్రముఖ కౌన్సిలర్ ఉన్నాడని ఆ స్థలం వెనుక డబ్బున్న న్యాయవాది, ఉన్నారని అనుకుంటున్నారు.డబ్బు,పలుకుబడి, ఉన్న వారు కబ్జా చేసి రాత్రికి రాత్రే షట్టర్లు నిర్మాణం చేసి యిప్పుడు అద్దెకునడుస్తున్నాయని ఆ స్థలం పై ఫిర్యాదు అందిన సంబంధిత రెవెన్యు అధికారులుమౌనం వహించడం లో అర్థం ఏంటో అర్థం కాలేదనిఇదేస్థలాన్ని బీజేపి కాంగ్రెస్ పార్టీ లలో చురుకుగా పని చేసి అసెంబ్లీ ఎన్నికల లో నిలబడిన సతీష్ మాదిగ,ప్రస్తుత ఎమ్మేల్యే,డాక్టర్,చిక్కుడు. వంశీ కృష్ణ కూడా రెవెన్యు ఆ స్థలం డాక్యుమెంట్ల ను తీసుకుని ఎమ్మేల్యే కాకముందు అధికారులను కలిసి ప్రభుత్వ భూమినికాపాడాలని కోరారు.అయినా ఇంతవరకూ సంబంధిత అధికారులు విచారణ చేయలేదు.ప్రభుత్వ భూమిగా గుర్తించ లేదు అంతలోనే వంశీ కృష్ణ ఎమ్మేల్యే గా అయ్యారు. దానిని మరిచి నట్లుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ భూమిని కాపాడాలని మళ్ళం కుంట లో బఫర్ జోన్ బౌండ్రీ నీ ఏర్పాటు చేయాలనీ వారు కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేణయ్య, మండికారి బాలాజీ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బల్మూరు జానకి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచంద్రయ్య, సీనియర్ నాయకులు పత్యా నాయక్, శ్రీనివాస్ గౌడ్, రంగినేని రవీందర్, అంతటి వెంకటేష్,లీలాబాయి,మాలిక్,నాయక్,కృష్ణంరాజు, శంకర్ గౌడ్,రాము,శివశంకర్,తదితరులు పాల్గొన్నారు.

39
1034 views