logo

యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గెలుపొందేరు

యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గెలుపొందేరు 

తూర్పుగోదావరి జిల్లా యానాం:

           యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తమ ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై 656 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ ఎనికలలో అశోక్ కు 16884 ఓట్లు రాగా .
రంగస్వామికి16228 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలలో మాజీ మంత్రి మల్లాడి రంగస్వామి తరపున ప్రచారం చేసి రంగస్వామి గెలుపు బాధ్యతలు తన భుజాలపై వేసుకుని అంతాతానై ప్రచారం చేసినా అశోక్ గెలుపును అడ్డుకోలేకపోయారు.
గత ముప్పై సంవత్సరాలుగా యానాంలోనే కాకుండా పుదుచ్చేరి రాజకీయాలను  అత్యంత ప్రభావితం చేసిన మల్లాడిని వెనక్కు నెట్టి అశోక్ చరిత్ర సృష్టించారు.
నమస్తే యానాం అంటూ యానాం ప్రజలకు చేరువై అతి తక్కువ సమయంలో ఎమ్.ఎల్.ఏ పదవిని చేజిక్కించుకున్నారు.
ఇతని రాజకీయ నేపథ్యం చూస్తే అశోక్ తండ్రి గంగాధర ప్రసాద్ యానాం బిజెపిలో  కీలక నేతగా వ్యవహరించారు.
తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన యానం ప్రజలకు అశోక్ కృతజ్ఞతలు తెలియచేసారు.
తాను యానాం ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నానని గెలిచిన అనంతరం అశోక్ మీడియాకు తెలియచేసారు.
పుదుచ్చేరి పూర్తి ఫలితాలు వెలువడిన అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రటిస్తానని అశోక్ అన్నారు


66
14734 views