logo

సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వీర నరసింహరాయలు కందనవీడు కోటను

సా.శ. 1505-1509 మధ్య విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వీర నరసింహరాయలు కందనవీడు కోటను అరవీడు రామరాజుకు బహూకరించినట్లు "ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా" అనే పుస్తకం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ తుళువవీర నరసింహారాయలను ఇమ్మడి నరసనాయకుడు అని కూడా పిలుస్తారు. "కందనవోలు" కోట చరిత్ర గురించి ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. బీజాపూర్ సుల్తాను అయిన యూసుఫ్ ఆదిల్ ఖాన్ తుంగభద్రానదిని దాటుకొని కందనవోలు కోటపై దండెత్తాడు. ఆ సమయంలో తుళువవీరనరసింహునికి అండగా అరవీడు రామరాజు నిలబడి బీజాపూర్ సుల్తానును పారద్రోలి కందనవోలు కోటతో పాటు ఆదోనిని కూడా ఆక్రమించడానికి సహాయపడ్డాడు. దానితో విజయనగర ప్రభువైన వీరనరసింహుడు రామరాజును మెచ్చుకొని కందనవోలు కోటను అతనికి బహుమానంగా ఇచ్చాడు. అతడే కర్నూలు కోటను పటిష్ఠం చేసి, కొండారెడ్డి బురుజును నిర్మించి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. కానీ అనేక మంది చరిత్రకారులు ఏమి చెబుతున్నారంటే కర్నూలులో 1529-49 మధ్య శ్రీకృష్ణదేవరాయలు సోదరుదైన అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు ఈ కోటను కట్టించినట్లు అభిప్రాయపడుతున్నారు. కొండారెడ్డి బురుజును నిర్మించినది కూడా అతనేనని దీనిఅసలు పేరు అత్యుత దేవరాయ బురుజు అని తెలియజేస్తున్నారు. కొండారెడ్ది బురుజును విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించారని ఒక ప్రతీతి. ఈ బురుజు గోడలపై రంధ్రాలున్న ప్రదేశాల దగ్గర విజయనగర రాజచిహ్నాలైన సంబంధించిన సింహం, ఏనుగు, గుర్రం వంటి బొమ్మలు కనబడతాయి.కందనవోలు కోట మొత్తం మూడు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, ఆరు అడుగుల ఎత్తుతో శత్రువుల నుండే కాక, తుంగభద్ర, హంద్రి నదుల వరదల నుండి కాపాడేటట్లు నిర్మించబడింది. ఈ కోట చుట్టూ ఒక లోతైన కందకం కూడా ఉండేది. నగర విస్తరణలో భాగంగా బ్రిటిష్ కాలంలో ఈ కోట గోడలన్నీ తొలగించారు. తుంగభద్ర నదివైపు ఇప్పటికీ తీరం వెంట ఎత్తైన కోట గోడను గమనించవచ్చు.


HINDUPUR
S.khajapeer

15
590 views