లండన్‌లో ఘోర విమాన ప్రమాదం......
లండన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఓ మినీ విమానం కుప్పకూలింది. ఈ సంఘటన లండన్ సౌత్‌ఎండ్ ఎయిర్‌పోర్టులో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. బీచ్ క్రాఫ్ట్ బీ200 సూపర్ కింగ్ ఎయిర్ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిర్ పోర్టుకు కొద్ది దూరంలోనే కుప్పకూలింది. నేలపై పడ్డ వెంటనే విమానం పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ ఎగిసిపడింది. విమానంలో ఉన్న వారంతా మంటల్లో చిక్కుకుపోయారు....
ప్రమాదానికి గురైన విమానంలో ఎంత మంది ఉన్నారన్నదానిపై సమాచారం లేదు. అది మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ జెట్‌గా తెలుస్తోంది. ఆ మినీ విమానంలో పేషంట్లను తరలిస్తూ ఉంటారు. జెట్ కుప్పకూలిపోవడానికి గల కారణాలు అయితే తెలియరాలేదు. ప్రమాదం నేపథ్యంలో సౌత్‌ఎండ్ ఎయిర్‌పోర్టు పలు విమానాల్ని రద్దు చేసింది. స్థానిక అధికారులతో కలిసి అక్కడి పరిస్థితి సమీక్షిస్తోంది.....