logo

100కు పైగా సినిమాలు.. చిరు, బాలయ్యలతో సూపర్ హిట్స్.. ఇప్పుడేమో క్రైస్తవ మత ప్రచారకురాలిగా.....

తమిళనాడులోని తంజావూరులో జన్మించిన ఈ అందాల తార మొదట బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. వందకు పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ లాల్, మమ్ముట్టి తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్ గా, 90స్‌ డ్రీమ్ గర్ల్ పేరు తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుంది. భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. పెళ్లయ్యాక కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైంది. అదే సమయంలో భర్తతోనూ విడాకులు తీసుకుంది. ప్రస్తుతం అమెరికాలోనే నివాసముంటూ క్రైస్తవ మత ప్రచారకురాలిగా బిజి బిజీగా గడుపుతోంది. ఇటీవల ఆమెకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. వీటిని చూసిన సినీ అభిమానులు నటిని చూసి ఆశ్చర్యపోయారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడు స్లిమ్ గా, నాజూకుగా ఉన్న ఈ అందాల తార ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? తను మరెవరో కాదు ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించిన మోహినీ అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్....

1991లో ఈరమన రోజావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోహిని. ఆ తర్వాత బాలయ్య ఆదిత్య 369 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత డిటెక్టివ్ నార, మామ బాగున్నావ్, హిట్లర్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 100 కి పైగా సినిమాల్లో నటించిన మోహినీ కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే 2011 తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎక్కడా కనిపించలేదు. మోహిని చివరిసారిగా 2011లో మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కలెక్టర్‌లో కనిపించింది.....

14
490 views
1 comment  
  • Raj Kumar Sharma

    Bangluru central jail ki news bhi do dr nagraj wali