logo

అంబకంటి గ్రామంలో కుక్క, ఎలుక కాటుకు ప్రకృతి వైద్యం-పరిశీలించిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి డాక్టర్ సాప పండరి

(చంద్ర న్యూస్:-నిర్మల్ జిల్లా బ్యూరో, జూలై 13)

కుంటాల మండలం అంబకంటి గ్రామంలో ఈ రోజు ""సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సమాచార హక్కు చట్టం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి""" ప్రతి ఆదివారం రోజున గ్రామంలో కుక్క కాటుకు,ఎలుక కాటుకు పసరు వైద్యం తో వైద్యం చేసే కారిగాం గంగన్న కలిసి వివరాలు తెలుపమని కోరగా, ఇట్టి వైద్యము మా గ్రామంలో వందల సంవత్సరాల నుండి పూర్వీకుల నుండి వస్తుందని, పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తామని, కుక్క కాటుకు, ఎలుక కాటుకు ప్రత్యేకమైన ఆయుర్వేద వైద్యమును సూర్యోదయానికి ముందు అడవిలోకి వెళ్లి,వేర్వేరు ప్రకృతితో కూడిన వనమూలికలను సేకరించి ఆవు పాలలో ఇట్టి ఔషధాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందిస్తామని తెలియజేశారు. దీనికి రోగులు వారం గాయం తీవ్రతను బట్టి వారం రోజులు,రెండు వారాలు పసుపు, నూనె,చింతపండు,ఉల్లిగడ్డ వంటి పదార్థములు తినకూడదని తెలియజేశారు. పూర్వికుల నుండి కారిగాం గంగన్న, ముజీగ పాపన్న, తుల భూమన్న,తుల భోజన్న నేటి వరకు కారిగాం పాపయ్య ఇప్పటి వరకు ఉచితంగానే వైద్యం చేస్తామని, నిర్మల్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, మహారాష్ట్ర వాసులు సైతం వందలలో రోగులు హాజరవుతారని తెలియజేశారు. గ్రామంలో ఎవరైనా మరణించినట్లయితే ఆరోజు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఔషధము ఇవ్వలేమని, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, నందిపేట్, మహారాష్ట్ర వాసులు సైతం వందలలో రోగులు వచ్చి ఔషధాన్ని స్వీకరిస్తారని, అదే విధంగా వైద్యం చేసేవారు ఆదివారం రోజున, ఏ ఊరుకు వెళ్లిన రాత్రి వరకు అంబకంటి గ్రామ శివారులోకి చేరుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు,పలు గ్రామాలకు సంబంధించిన రోగులు, కుటుంబీకులు పాల్గొన్నారు.

32
1654 views