కీర్తిశేషులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు *తాడిబోయిన వెంకటేశ్వరరావు యాదవ్* (చిన్న గారి)వర్ధంతి...
తేదీ :12-7-2025 : దుగ్గిరాల,ఈరోజు జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు దుగ్గిరాల గ్రామవాసి కీర్తిశేషులు తాడిబోయిన వెంకటేశ్వరరావు యాదవ్ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుమారుడు తాడిబోయిన రామస్వామి యాదవ్ దుగ్గిరాలలో గల MPP స్కూల్ నార్త్(యాదవపాలెం) విద్యార్థిని,విద్యార్థులకు నోట్ బుక్స్ స్టేషనరి చింతలపూడి MPP స్కూల్ నందు S ఛైర్స్ దుగ్గిరాల గ్రామ పంచాయితీలో గల పారిశుద్ధ్యకార్మికులకు 40 మందికి ఒక లీటరు స్టైలిష్ స్టీల్ మంచినీళ్ళ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది వర్షాకాలంలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలపై అవగాహన కరపత్రాలు ముద్రించి విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా *తాడిబోయిన వెంకటేశ్వరరావు యాదవ్* గారి సేవలను స్మరిస్తూ చివరివరకు కాంగ్రేస్ పార్టీలో సేవచేశారు అని అనేకమంది గ్రామస్తులు అభిమానులు నాయకులు కీర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్ల నూకల వెంకటేశ్వరరావు,కుర్రా. నాగయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.