logo

SK GOT FARAM. రాజస్థాన్ పేరుతో మోసం.

రాజస్థాన్లోని కోట ప్రాంతానికి చెందిన SK Got faram రాజస్థాన్ కు చెందిన షరీఫ్ ఖాన్ అలియాస్ సరూఫ్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలు పెట్టడం మేకలు గొర్రెలను ఇండియాలోని ఏ ప్రాంతానికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని మా వద్ద అన్ని రకాల జాతులకు సంబంధించిన మేకలు గొర్రెలు ఉన్నాయని వీడియోలు ఫోటోల ద్వారా ఇంస్టాగ్రామ్ ప్రచారం చేసుకొని అమాయకుల వద్ద లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ఈ మూట వ్యవహారం ఇటీవల బయటపడింది ధర్మవరం పట్టణానికి చెందిన అమీరు భాష ఈ వీడియోలను ఫోటోలను చూసి ఒక మేకను కొనుగోలు చేశారు అందు సంబంధించిన మొత్తం 6000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చుకు గాను మరో వెయ్యి రూపాయలు మొత్తం 7000 రూపాయలు పేటీఎం ద్వారా జులై 5వ తేదీ చెల్లించారు డబ్బు మొత్తం తీసుకున్నాక ఆరోజు రాత్రి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని అందుకు మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశారు ఇది మోసపూరితమైన చర్యగా అప్పుడు పసిగట్టి వెంటనే తనకు అమౌంట్ ఇవ్వాలని కోరడం జరిగింది దీంతో షరీఫ్ ఖాన్ మాట మార్చాడు ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని తాను కూలి నాలి చేసుకొని జీవించే వాడినని క్షమించమని ప్రాధేయపడ్డాడు. కోట ప్రాంతానికి చెందిన షరీఫ్ ఖాన్ పచ్చి మోసగాడుగా అనేకమంది అమాయకుల్ని మోసం చేసిన వ్యక్తిగా తెలుస్తోంది దీంతో ధర్మవరంలో మోసపోయిన వ్యక్తి రాజస్థాన్ సైబర్ క్రైమ్ వారికి రిపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే నిందితుడు అతనికి సహకరించిన వ్యక్తులను కూడా తీసుకొని విచారించే అవకాశం ఉంది.

7
813 views