
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్*
దుగ్గిరాల
భారతరత్న డాక్టర్ బి సి రాయ్ స్మారక పురస్కారాల ప్రధానోత్సవం"
(తేదీ,11 -07 -2025. దుగ్గిరాల:ఈరోజు ఉదయం దుగ్గిరాల గ్రామంలో గల ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ (పీపీహెచ్ )నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల పక్షోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *భారతరత్న బీసీ రాయ్* చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా *రామస్వామి యాదవ్* మాట్లాడుతూ, ఈ సమాజంలో అధ్యాపక వృత్తి తర్వాత అత్యంత గౌరవప్రద వృత్తి వైద్య వృత్తి అని అన్నారు. అధ్యాపకుడు ఈ సమాజంలో జ్ఞాన జ్యోతి వెలిగిస్తే, వైద్యుడు ఆ జ్యోతిని కాపాడుతూ ఉంటాడు అని అన్నారు. భారతరత్న డాక్టర్ బి.సి రాయ్ లండన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎం ఆర్ సి పి, ఎఫ్ ఆర్ సి ఎస్ రెండున్నర సంవత్సరాలలో ఏకకాలంలోనే పూర్తిచేసిన అత్యంత ప్రతిభావంతుడు అయిన వైద్యుడు. అని కొనియాడారు. భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఆచార్యుడిగా, కలకత్తా యూనివర్సిటీ ఉపకులపతిగా, కలకత్తా మేయర్ గా, మెడికల్ జర్నల్స్ కి సంపాదకుడిగా, వెస్ట్ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా, సుమారు 14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ మరియు కలకత్తా నగరంలో అనేక మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజీలు స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. మహిళలకు, పిల్లలకు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కొరకు,ప్రత్యేక వైద్యశాలలు నెలకొల్పడం జరిగింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసి, వైద్యరంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కుతుందన్నారు. వారు ఈ సమాజానికి వైద్యునిగా, స్వాతంత్ర సమరయోధునిగా, రాజకీయ నాయకుడిగా, అందించిన విశేషమైన సేవలను గుర్తించి, భారత ప్రభుత్వం వారికి 'భారతరత్న' బిరుదుతో సత్కరించడంతోపాటు, వారి జన్మదినం జులై ఒకటిని 'జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించి జాతీయ స్థాయిలో వైద్యరంగం తో పాటు, ఇతర రంగాలలో లబ్ధ ప్రతిష్టులైన వారికి పురస్కారాలు ప్రధానం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల జీవితాలకు,సమాజానికి వారు అందించిన అమూల్యమైన సేవలను గుర్తించి, కృతజ్ఞతలు చెప్పడం. వారిని గౌరవించడం అని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పని చేస్తూనే, ప్రజలకు ఉచిత వైద్య సేవలను కొనసాగించేవారు అని తెలిపారు. నేటి యువ వైద్యులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, పేద, మధ్యతరగతి వారికి నిస్వార్థ వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా దుగ్గిరాల పీహెచ్ సి మరియు ఈమని పీహెచ్ సి లో పనిచేస్తున్న వైద్యులక(Dr అబ్దుల్ రెహమాన్ డాక్టర్ ఇందిరా డాక్టర్ రహే మున్నిసా) బీసీ రాయ్ స్మారక పురస్కారాలు (జ్ఞాపిక శాలువా పగిడి పుష్పగుచ్చాలు) అందజేయడం జరిగింది. అలాగే *ప్రపంచ జనాభా దినోత్సవం* పురస్కరించుకొని, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల (మాత శిశు సంక్షేమ) కుటుంభ నియంత్రణ ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిర్వహించే ఆశా వర్కర్స్ కి 30 మందికి వన్ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీలు వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్, , జట్టి బాలరాజు,జాగృత భారత్ ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి. గణేష్, కొంగర జోగేంద్ర, మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నల్ల నూకల వెంకటేశ్వరరావు,హనుమాన్,షేక్ శుభాని, కుర్ర నాగయ్య,గరిక,శ్రీనివాసరావు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.