తల్లిదండ్రుల మార్గదర్శకంలో నడిచి ఉన్నత శిఖరాలను అధిరోహించండి. తాసిల్దార్ నాగమ్మ
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో ప్రధాన అధ్యాపకురాలు పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మండల ప్రత్యేక అధికారిగా విచ్చేసిన తాసిల్దార్ నాగమ్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు చూపిన మార్గంలో నడుస్తూ , ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలను అధిరోహించి, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రత్యేక పరిశీలనాధికారిగా విచ్చేసిన మనోహర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని,విద్యార్థి దశలోనే మంచి చెడు నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మాటలను ఉపాధ్యాయుల అడుగుజాడలు నడుస్తూ మంచి స్థితిలో తెరపడాలని తెలిపారు. ఎంపీడీవో నాగేశ్వరరావు పాఠశాల భవనాలను పరిసరాల పరిశుభ్రతను పర్యవేక్షించారు. అనంతరం పాఠశాలలో తల్లిదండ్రుల ఆటల పోటీ నిర్వహించి వారికి బహుమతులు అందించడం జరిగింది. అలాగే సర్పంచ్ కాంతమ్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల మాటల గౌరవించి బాగా చదివి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యా కమిటీ చైర్మన్ వై పెద్దినాయుడు మాట్లాడుతూ మన పాఠశాలలో అత్యున్నత విలువలు కలిగిన ఉపాధ్యాయులు ఉండడం మన అదృష్టమని వారి యొక్క సేవలను ఉపయోగించుకొని విద్యార్థులందరూ మంచి స్థితిలో ఉండాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు పాల్గొని భోజనాలు చేశారు. ప్రధాన అధ్యాపకురాలు మాట్లాడుతూ తాము పిలిచిన వెంటనే విచ్చేసిన తల్లిదండ్రులకు, కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారులుగా వచ్చిన ప్రతి అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
I Mohammad Amjad khan AIMA MEDIA Hyderabad
Hello