విజయవంతంగా కస్తూర్బా గాంధీ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం.
అనకాపల్లి జిల్లా రోల్గుంట మండలం రోలుగుంట కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రిన్సిపల్ తులసి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సమావేశానికి ప్రత్యేక అధికారి మనోహర్ విచ్చేసి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుంచే మంచి విషయాలను అలవర్చుకోవాలని ఉపాధ్యాయుల పర్యవేక్షణలో బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని అన్నారు. అలాగే తాసిల్దార్ నాగమ్మ పర్యవేక్షణలో పాఠశాల పరిసరాలను పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి అన్ని వసతులు సౌకర్యాలు గురించి ఆరా తీశారు. ఎంపీడీవో నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదివి దేశం గర్వించదగ్గ పౌరులుగా తయారవ్వాలని అన్నారు. ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగిన తనకు నిర్భయంగా తెలపవచ్చని ప్రభుత్వం విద్యార్థులు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తుందని ప్రతి తల్లికి తల్లికి వందనం అందించిందని తెలిపారు. ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులందరకు కృతజ్ఞతలు అని మీ పిల్లల బాధ్యత పూర్తిగా కస్తూరిబా గాంధీ పాఠశాల అధ్యాపకులు దేనిని వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదివిన విద్యార్థులు మండల స్థాయిలో మొదటి మరియు రెండవ స్థానాలను కైవసం చేసుకున్నారని అలాగే త్రిబుల్ ఐటీ కి ఎంపికయ్యారని తెలిపారుఅనంతరం తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించి, తల్లిదండ్రులచే ఆటలాడించి, కస్తూర్బా గాంధీ పాఠశాలలోనే మధ్యాహ్న,భోజనం తల్లిదండ్రులకు పాఠశాలలోనే ఏర్పాటు చేశారు. అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు.