ఉమ్మడి ఖమ్మం జిల్లా దళిత కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్ కోడ్ తండా దళిత కాలనీల్లో సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బానోత్ రవి కోరారు. ఆర్ కోర్ తండా లో గ్రామ ప్రజలతొ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పశువుల రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా దళిత కాల నీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. డ్రైనేజీ, రహదారులు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు , రిపబ్లిక్ ఆఫ్ పార్టీ ఆర్ పి ఐ పార్టీ, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సరిగమల స్నేహలత, తదితర నాయకులు పాల్గొన్నారు.