
కోనో కార్పస్ మొక్క ముప్పే!*
*బొద్దింకలు, హౌస్ డస్ట్, వయ్యారి భామ చెట్లూ హానికరమే,
* వివిధ రకాల ఎలర్జీలకు ఇవే కారణం,
*ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్ హెచ్చరిక*
తెలంగాణ స్టేట్:: హైదరాబాద్** (జూలై 05 )ఏఐఎంఏ మీడియా
*కోనో కార్పస్ మొక్క ముప్పే!*
*బొద్దింకలు, హౌస్ డస్ట్, వయ్యారి భామ చెట్లూ హానికరమే,
* వివిధ రకాల ఎలర్జీలకు ఇవే కారణం,
* అప్రమత్తత లేకపోతే ప్రాణపాయమే.
* 25 ఏళ్ళలో తొలిసారిగా కీలకమైన, అలర్జీ -ఆటో ఇమ్యూనిటీ, సమాచార డేటా విడుదల,
* 42% ప్రజల్లో కోనో కార్పస్ వలన ఎలర్జీ,
*గణనీయంగా పెరిగిన ఆటో ఇమ్యూనిటీ వ్యాధులు,
* ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్ హెచ్చరిక*
హైదరాబాద్: భారతదేశంలో మొట్టమొదటిసారి వెయ్యి మంది ఎలర్జీ పేషెంట్ల రకాలు, వివిధ రకాలైన ఎలర్జీలు, వేటి వల్ల ఎలర్జీ వస్తుంది? నియంత్రించవచ్చు , ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ విడుదల చేశారు.
కోనో కార్పస్ మొక్క వలన, వాటి నుంచి వచ్చే పొప్పడి వలన ప్రమాదం పొంచి ఉందని, 42% ప్రజలు దీనివల్ల వివిధ రకాలైన ఎలర్లతోనే బాధపడుతున్నారని నివేదికలో వెల్లడించారు.
అత్యధికమైన ఎలర్జీ బొద్దింకల వలన, హౌస్ డస్ట్ మైట్ వలన, పార్థియం వయ్యారి భామ చెట్టు పొప్పడి వలన, అని నిర్ధారణ రిపోర్ట్ లో ఉన్న వివరాలు వెల్లడించారు.
భారతదేశంలో అత్యధికంగా హైదరాబాదులోనే అశ్విని ఎలర్జీ సెంటర్ కేంద్రంగా 10 వేల మంది కంటే ఎక్కువగా అలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనో థెరపీ అందించారని తెలిపారు.
అలర్జన్ స్పెసిఫిక్ ఇమినోథెరపీ అనే అత్యాధునికమైన చికిత్స విధానం కేవలం అమెరికా, యూరోప్ ,లండన్ లాంటి ప్రాంతాల్లో ఉండేదని, 10 ఏళ్ళుగా భారతదేశంలో ప్రారంభించినట్టు తెలిపారు. అలర్జీ లకి ఇప్పటికి విరుగుడు ఎలర్జన్ ఇమినో థెరపీ అని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా పర్యావరణ పదార్థాలు, పిండి పదార్థాలు, కోనో కార్పస్ వంటి విషవృక్షాల డేటా, అలర్జీ వారోత్సవాలు సందర్భంగా డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ విడుదల చేశారు. 2020 కోవిడ్ వైరస్ తర్వాత అధికంగా రోగ నిరోధక శక్తిలో మార్పులు తెలిశాయన్నారు. అత్యధికంగా హీష్టమైన్ రక్తంలో ఉత్పత్తి అవుతోందని, హిష్టమైన అని కెమికల్ వల్లనే ఎలర్జీలు పెట్రేగుతున్నాయని హెచ్చరించారు. ఎలర్జీలు ఆటో ఇమ్మ్యూనిటీలుగా మారుతున్నయని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.
అంతే కాకుండా వివిధ రకాలైన ఎలర్జీల వలన పెదవిలు, వాయడం చెవులు వాయడం, విపరీతంగా శ్వాసకోశ ఇబ్బంది, శరీరం మొత్తం దద్దుర్లు వస్తుంటాయని వీటిని యాంజియో ఎడిమా అంటారు. ఇటువంటి యాంజియో ఎడిమా వంటి ప్రమాదకరమైన పరిస్థితులు గనక అశ్రద్ధ చేసినట్లయితే, ప్రాణపాయ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ వ్యాకరణం హెచ్చరించారు.
గుండెపోటు కంటే అతి భయంకరమైన పరిస్థితి ఎనాఫిలిటిక్ షాక్. ఎలర్జీ రోగులకు శరీరంలో విపరీతంగా ఎలర్జీ పెరగడం వల్ల అత్యధికమైన హిస్టమన్ రక్తంలో ప్రవహించడం వల్ల, యాంజియో ఎడిమా షాక్ వంటి ప్రాణాపాయ స్థితి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అనఫలైటిక్ షాక్ పేషెంట్ ని, గుర్తించి, రోగ లక్షణాలు గమనించి, ఆసుపత్రికి తరలించి, ట్రీట్మెంట్ అందించే లోపు అయిదు నిమిషాల సమయం మాత్రమే సమయం ఉంటుందని ఆలస్యమైనట్టయితే ప్రాణ ముప్పుని తెలిపారు.
కరోనా రోగం ముందు నెలకు ఒకట్రెండు యాంజియో ఎడిమా కేసులు, ఆటో ఇమ్యూనిటీ వంటి రోగాలు చూసే వాడిని కానీ, ఇప్పుడు రోజుకు ఒక ఆటో ఇమ్యూనిటీ ఎలర్జీ పేషెంట్ చూడడమే కాకుండా యాంజియో ఎడిమా పేషెంట్లు విపరీతంగా పెరుగుతున్నారని తెలిపారు. ఎలర్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేనట్లయితే ప్రాణాపాయ స్థితి వస్తుందని డాక్టర్ వ్యాకరణం హెచ్చరించారు.
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42