పేరు గల్లంతు పై విచారణ
- నోటీసులు జారీ చేసిన ఎంపివో అఫ్జల్ మియా
పేరు గల్లంతు పై విచారణ
నోటీసులు జారీ చేసిన ఎంపివో అఫ్జల్ మియా
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ ఆన్ లైన్ రికార్డుల్లో ఇంటి యజమాని పేరు గల్లంతు విషయంపై ఈ నెల 8న (మంగళ వారం) మధ్యాహ్నం 2:00 గంటలకు స్థానిక ఎంపీవో కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా విచారణ చేపట్ట నున్నారు. ఈ మేరకు బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేసి పెగడపల్లి మండలం రాజారాంపల్లి కి బదిలీ పై వెళ్ళిన పంచాయతీ కార్యదర్శి నరేందర్ కు నోటీసులు జారీ చేశారు. ఇంటి యజమాని పేరు గల్లంతు తో పాటు మరో రెండు ఇండ్ల ఆన్ లైన్ అసెస్మెంట్ తేదీలలో కూడా తేడా రావడం పై విచారణ జరుపనున్నారు. సంబంధిత అసెస్మెంట్, మ్యుటేషన్, పర్మిషన్ పత్రాల ప్రతులతో సహా విచారణకు హాజరు కావాలని నరేందర్ ను ఆదేశించారు. పిర్యాదుధారుడు చుక్క గంగారెడ్డి తో పాటు ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి అక్బర్ ను కూడా ఇట్టి విచారణలో పాల్గొనాలని సూచిస్తూ... నోటీస్ ప్రతులను అందజేశారు.