logo

సీత్ల పండుగను అందరూ ఒకే రోజు జరుపుకోవాలి ***భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ***

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** జూలూరుపాడు మండలం **జులై 05** (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
------------------------------


సీత్ల పండుగను బంజారాలు అందరూ ఒకే రోజు జరుపుకోవాలి

--------------------------------

బంజారాలు అతి పవిత్రంగా జరుపుకొనే సీత్లాభవాని పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంజారాలూ వేరుగా కాకుండా ఒకేరోజు ఈ నెల జులై 8న జరుపుకోవాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా
శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి సోదరులంతా తమ ఊరిలో ఉన్న పాడిపంటలు, పశువులు బాగుండాలని గ్రామంలో ఆనంద ఉత్సవాలతో మన తర తరాలు జరుపుకునే సీత్లా భవాని పండుగ అన్నారు. జాతి ఐక్యతను చాటుకోవాలంటే వేరుగా కాకుండా మన మందరం ఒకే రోజు జరుపుకుంటే బంధాలు, ఆత్మీయతులు, జాతి ఐక్యత పెరుగుతుందన్నారు.

50
2271 views