
జగన్నాథ్ రధ యాత్ర 2.0 మహోత్సవం
- కానూరు భక్తుల పారవశ్యం
- 9.0 లక్ష్యంగా ఇస్కాన్ విజయవాడ భక్త బృందం.
జగన్నాథ్ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్ ప్రోత్సాహం
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
జగన్నాథ్ రధ యాత్ర 2.0 మహోత్సవం
- కానూరు భక్తుల పారవశ్యం
- 9.0 లక్ష్యంగా ఇస్కాన్ విజయవాడ భక్త బృందం.
జగన్నాథ్ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్ ప్రోత్సాహం
శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్ర మహారాణి వారు అలంకరించిన రథంపై ఆసీనులై ఉండగా కానూరు శ్రీ సాయి గీతా మందిరం వద్ద రథయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధులుగా సిద్ధార కాలేజీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్
పరుచూరి వెంకటేశ్వరావు, ప్రొఫెసర్ వెంకట రత్న ప్రసాద్
పాల్గొనగా, మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం వెంకటేశ్వరావు, వెంకట రత్న ప్రసాద్ లు మాట్లాడుతూ ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో
శ్రీ జగన్నాథ రథయాత్ర గత మూడు సంవత్సరాలుగా వైభవోపేతంగా నిర్వహిస్తున్నారని, మొన్న సితార గ్రౌండ్స్ వద్ద నిర్వహించగా లక్షలాదిమంది పాల్గొన్నారని, ఈరోజు కానూరు ప్రాంతంలో నిర్వహించటం, భక్తులు పారవశ్యంతో రథయాత్రలో పాల్గొనటం సంతోషాన్నిస్తుందని, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శ్రీల ప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించి, ప్రాశ్చాత్య దేశాలకు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని ఇవ్వటానికి వచ్చా నని చెప్పి, మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారని, కొనియాడారు. చక్రధారి దాస్ ప్రసంగిస్తూ జగన్నాథ్ రథయాత్ర 2025 విజయవాడ నగరంలో 2.0, తెనాలి, మంగళగిరి, వివిఐటి యూనివర్సిటీ ఈ ప్రాంతాలలో కలిపి 5 జరిగాయని, వచ్చే ఏడాదికి 9 ప్రాంతాలలో (9.0) జరిపేందుకు లక్ష్యంగా విజయవాడ ఇస్కాన్ భక్త బృందం కృషి చేస్తారని తెలిపారు. జగన్నాథ్ రథయాత్రలో పండితుల నుండి పామరులవరకు సేవ చేసే అవకాశం ఉంటుందని, శ్రీల ప్రభపాద్ అవకాశం కల్పించారన్నారు. ఎవరైతే రథం లాగుతారో వారంతా ప్రభు పాద మెర్సీ వలన ధామం వెళ్ళే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతం అంతా సుభిక్షం ఉంటుందన్నారు.
ముందుగా గౌరాంగి, హర్షిని, సహర్ష సాంప్రదాయ భరతనాట్య నృత్యాలను ప్రదర్శించారు.
శనివారం కానూరులో శ్రీ సాయి గీత మందిరం నుంచి శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర ప్రారంభమై పంట కాలువ రోడ్డు మీదుగా, నాగార్జున హాస్పిటల్స్, నెక్స్ట్ జెన్ పబ్లిక్ స్కూల్, ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు , బందర్ రోడ్డు మీదుగా ఆటోనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ సాయి బాబా కళ్యాణ మండపం వద్దకు చేరుకుంది.
ఆద్యంతం రథ యాత్ర హరినామ సంకీర్తనలతో, కోలాటం, భక్తుల నృత్యాలతో, భక్తులకు ప్రసాదాల పంపిణీలతో వైభవోపేతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో బలరాం గోవిందా దాస్, వ్రజథామ్ దాస్, శ్రీకాంత్ నరసింహ దాస్, శ్యామ్ సుందర్ అచ్యుత దాస్, బ్రహ్మచారుల బృందం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.