
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్*
'వర్షాకాలంలో వచ్చే వ్యాధులు - నివారణా చర్యలపై అవగాహన...'
తేదీ: 05-07-2025: శేర్లింగంపల్లి చందానగర్:ఈరోజు ఉదయము వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన అవగాహన కరపత్రాన్ని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల లహరి ఎస్టేట్ నందు విడుదల చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రవీంద్ర కుమార్, CMO, HCU హెల్త్ సెంటర్ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ లు విచ్చేసి కరపత్రాన్ని విడుదల చేసి తదనంతరం మాట్లాడుతూ " *మనకున్న ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం వంటి మూడు కాలాలలో వర్షాకాలంలో వ్యాధులు (సీజనల్ డిసీజెస్) ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అతిసారం, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు వ్యాధి మరియు కోవిడ్25 వేరియంట్ లాంటి వ్యాధులు విజృంభిస్తాయి. మానవుడు జీవితంలో తను అనుకున్నది సాధించాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కావున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొన్నచో మన ఆరోగ్యం మన చేతులలోనే ఉంటుంది. మనం తినే భోజనము సరైన వేళలలో తీసుకోవడం మంచిది. వీలైనంతవరకూ బయటి ఆహారాన్ని వినియోగించడం మానాలి.* *ఆహారాన్ని, ఆహార పదార్థాలను తగు పాళ్ళలో ఉడికించి వేడి పదార్థములనే తినాలి. ఐసు క్రీము, కూల్ డ్రింక్స్ వంటి వాటిని పరిశుభ్రంగా ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం మంచిది.* *నాణ్యతా ప్రమాణాలను పాటించే కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. ఆహార పదార్థాలపై ఈగలు, బొద్దింకలు వంటి కీటకాలు వాలకుండా చూసుకోవాలి. భోజనానికి ముందు ప్రతి సారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగ ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే త్రాగాలి. ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి మూడే కారణాలు. 1. మనం తినే ఆహారం. 2. త్రాగే నీరు. 3. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత.*
*నిత్యము యోగా, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ మరియు తాజా ఆకుకూరలు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వ్యాధి చికిత్స కన్నా నివారణ మిన్న కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పై జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి"* అని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారబోయిన సదానంద యాదవ్, సభ్యులు G.V. రావు, శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, ప్రేమ్ సింగ్, వాణి సాంబశివరావు, శ్రీమతి సుజాత తదితరులు పాల్గొన్నారు.