logo

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు - స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ -
పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు -
స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి -

హైదరాబాద్ : ( 04- 07- 2025, శుక్రవారం)
( CHUKKA GANGA REDDY - SENIOR JOURNALIST)

తెలంగాణ ఉద్యమాల రథ సారధి, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయ్యారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
ప్రజా సమస్యలు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జన సమితి నేతలు
చర్చించారు.

ఉద్యమకారులు, నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి జనసమితి సూచనలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణ జన సమితి కి తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలపై తెలంగాణ జనసమితి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి నేతలు సయ్యద్ బద్రుద్దీన్, అంబటి శ్రీనివాస్, గోపగాని శంకర్ రావు, కుంట్ల ధర్మార్జున్, బైరి రమేష్, పల్లె వినయ్ కుమార్, నిజ్జన రమేష్ ముదిరాజ్, ఆశప్ప, సలీం పాషా తదితరులు పాల్గొన్నారు.

15
18 views