“జై బాబు - జై భీమ్ - జై సంవిధాన్" ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన రేగళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 04: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య పిలుపు మేరకు. శుక్రవారం రోజున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “జై బాబు - జై భీమ్ - జై సంవిధాన్” ముఖ్య కార్యకర్తల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వెళ్ళారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఉమ్మడి రేగళ్ళ నుండి లక్ష్మీదేవిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధారావత్ దుబాలో నాయక్, అజ్మీరా మోహన్, భూక్యా సీతారాం, ధారావత్ రమేష్, నూనావత్ రమేష్, నూనావత్ శంకర్ కాంగ్రెస్ పార్టీ “జై బాబు - జై భీమ్ - జై సంవిధాన్” కార్యక్రమం విజయవంతం అయింది అని తెలిపారు.