కలెక్టర్, సిబ్బందికి సీఎస్ అభినందనలు
జిల్లాలోని గంట్యాడ, రాజాం మండల సమాఖ్యలకు జాతీయస్థాయిలో ఆత్మనిర్బ్చర్ సంఘటన్ అవార్డ్స్ సాధించాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ అంబేడ్కర్‌తో పాటు సిబ్బందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అభినందించారు. గురువారం సాయంత్రం కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందనలు తెలిపారు. వీళ్లు జూలై 10న న్యూ ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని అవార్డులను అందుకొనున్నారని తెలిపారు.