logo

టవర్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలి: సిపిఐ.

నంద్యాల జిల్లా/ బేతంచెర్ల(AIMA MEDIA):
బేతంచర్ల పట్టణంలోని డోన్ రోడ్డు సమీపంలో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నిర్మిస్తున్న నూతన టవర్ నిర్మాణ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేశారు. (సీపీఐ) మండల కార్యదర్శి భార్గవ్, సహాయ కార్యదర్శి తాలూకా తిరుమలేష్, పట్టణ కార్యదర్శి పీ.నాగరాజు ల ఆధ్వర్యంలో కాలనీవాసులతో టవర్ నిర్మాణ పనుల నిలిపివేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం చేరుకొని కమిషనర్ హరిప్రసాద్ కు కాలనీవాసులతో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ వలన అనేక రకాల రోగాలు, చర్మవ్యాధులు, పెరాలసిస్, గుండెపోటు, సంతానోత్పత్తి లేకపోవడం లాంటి సమస్యల బారినపడి ఇబ్బందులు గురవుతున్నామని వైద్య ఖర్చులకు చితికి పోతున్నామని కమిషనర్ దగ్గర వాపోయారు ఇప్పటికైనా అధికారులు నూతన టవర్ నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దుచేసి కాలనీవాసులకు న్యాయం చేయాలని కోరారు.లేనిపక్షంలో కాలనీవాసులతో మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు.

0
3 views