logo

వాలంటీర్ జాబ్ కల్పించి నిరుద్యోగులను వై ఎస్ జగన్ మోసం చేశారు... ఏడాది అయినా వైసీపీ ఆరాచకాలను ప్రజలు మరువలేదు... ఉమ్మడి ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు... - నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

నంద్యాల, జూలై 3,AIMA మీడియా,
ఆర్ ఎన్ రెడ్డి:

ఏడాది గడచినా గత వైసీపీ ప్రభుత్వ ఆరాచకాలను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని, ఉన్నత చదువులు చదివిన యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించకుండా కేవలం గౌరవ వేతనంతో వాలంటీర్ జాబ్ కల్పించి నిరుద్యోగ యువతను వై ఎస్ జగన్ మోసం చేశారాని, ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్ని పథకాలు అందుతున్నాయని, ఉమ్మడి ఏడాది పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

గురువారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సుపరిపాలనలో - తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం పథకాలు అందుతున్న విధానం వివరించారు.

ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ జగన్ పాలనపై ప్రజలు విసుగుచేంది వైసీపీకీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, మళ్ళీ ఏ మోహం పెట్టుకొని పాదయాత్రతో ప్రజల ముందుకు వస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. డిగ్రీ, పీజీ చేసిన అర్హత గల యువతకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించకుండా రూ. 5 వేల గౌరవవేతనంతో వాలంటీర్ జాబ్ కల్పించి నిరుద్యోగులను వై ఎస్ జగన్ మోసం చేశారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విమర్శించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏడాది ఉమ్మడి పాలనలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తున్నాయని, లూలు, రిలయన్స్, ఎం జీ, తదితర కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పడం వల్ల ఇప్పటికే 9 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, మరో నాలుగేళ్లలో 40 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లు ముందుకు సాగుతున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.

ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టే ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారన్నారు. ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే తెలుసుకొని వాటి పరిస్కారం కోసం ఇంటింటికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వెళుతున్నామన్నారు. వైసీపీ తాటాకు చెప్పుళ్లకు టీడీపీ కార్యకర్తలు భయపడరని, ఏ మోహం పెట్టుకొని వైసీపీ నాయకులు పాదయాత్రతో ప్రజల వద్దకు వస్తారని ఆమె నిలదీశారు. వైసీపీ పాలనలో ఇంట్లో ఒకరికే అమ్మవడి ఇస్తే సీఎం చంద్రబాబు ఇంట్లో చదువుకుఅంటున్న వారందరికీ తల్లికి వందనం అందించారని, ఇదేళ్ళ వైసీపీ పాలనలో కేవలం రూ. 250 లు పెన్షన్ పెంచితే సీఎం చంద్రబాబు ఏకంగా రెండు వేల పెన్షన్ రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు, వైద్యం అంధుకున్న దీర్ఘకాళిక రోగులకు రూ. 10 వేల పెన్షన్ పెంచి ప్రతి నెల ఒకటవ తేదీననే ఇంటికి వచ్చి అందిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, ఉమ్మడి కర్నూలు జిల్లా మార్కెటింగ్ సోసైటీ లిమిటెడ్ జిల్లా చైర్మన్ వై నాగేశ్వరావుయాదవ్ డోన్ నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సుపరిపాలనలో - తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.

33
1675 views