
నందమూరి నగర్ కుందూ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి...
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఎం పార్టీ డిమాండ్
నంద్యాల, జులై 3, AIMA మీడియా ఆర్ ఎన్ రెడ్డి:
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ ) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నందమూరి నగర్ పోయే దారిలో కుందూ నదిని పరిశీలించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు పుల్లా నరసింహులు, నందమూరి నగర్ సిపిఎం పార్టీ నాయకుడు చైన్ సింగ్, ఆ ఏరియా నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి నగర్ కుందూ నది బ్రిడ్జి దాదాపు అర్థ కిలోమీటర్ బ్రిడ్జి రెండు వరుసల వంతెన 2017 సంవత్సరంలో 7కోట్ల 33 లక్షలతో అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ బ్రిడ్జిని పట్టించుకునే నాధుడే లేడు,తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్లు పూర్తి చేయలేదు.అప్పటి ప్రతిపక్షంలో వున్నా టీడీపీ పార్టీ మేము ఆధికారంలోకి వొస్తే కచ్చితంగా పూర్తి చేస్తాం అని నొక్కి చెప్పారు, కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వొచ్చి సంవత్సరామ్ పూర్తి చేసుకున్న ఇప్పటికీ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ లో అనేక కార్యక్రమాలకు మంత్రిగారు మంత్రి కొడుకు గారు 20 సార్లు తిరిగారు, మళ్ళి వారికి కుందు బ్రిడ్జి సమస్య కనబడుతుందో కనపడలేదో అర్థం కావడం లేదు, ఈ యొక్క బ్రిడ్జి మీద వందల ఆటోలు వేల మంది జనాభా రోజువారి పనుల నిమిత్తం నంద్యాలకు వస్తున్నారు, ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కుందు కాలువ పూర్తిగా నిండుతుంది ఆ సమయంలో ప్రజలు పోలూరు మీద నుండి ఆటోనగర్ మీద నంద్యాల కు రావాల్సి వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది, టిట్కో ఇల్లు ఓపెన్ అయితే ఇంకా జనాభా పెరిగే అవకాశం ఉంది, పాత బ్రిడ్జి కూడా ఎప్పుడు కులుతాదో అర్థం కాని పరిస్థితి కనపడుతుంది, ఇప్పటికీ కుందు బ్రిడ్జి పూర్తికాక నందమూరి నగర్ రోడ్డు గుంతలు పడి జనాలు తిరగలేని పరిస్థితి కనపడుతుంది, అనేకమంది కింద పడతా ఉన్నారు, కాబట్టి వెంటనే నందమూరి నగర్ కుందుపైన బ్రిడ్జిని పూర్తి చేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాబు వలి జాకీర్ అంజి తదితరులు పాల్గొన్నారు.