logo

'అన్నదాత సుఖీభవ' డేటా నమోదును ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్.

నంద్యాల జిల్లా/సిరివెళ్ల (AIMA MEDIA):
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం, సిరివెళ్ల గ్రామంలోని రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) లో అన్నదాత సుఖీభవ పథకం కింద జరుగుతున్న డేటా ఎంట్రీ పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సి. విష్ణు చరణ్ జులై 3వతేది గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆర్‌బీకే కేంద్రంలో జరుగు కార్యకలాపాలను, డేటా నమోదు ప్రక్రియను, రైతుల ఆధార్, ఖాతా, భూమి సంబంధిత వివరాల నమోదులో పని నాణ్యతను జేసి సమీక్షించారు. డేటా ఎంట్రీలో జాగ్రత్తలు పాటించాలనీ, పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, "అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలు రైతులకు నేరుగా లాభం చేకూర్చే విధంగా అమలవుతుండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా మద్దతు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

0
3 views
  
1 shares