logo

ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొన్న బైక్ ఇద్దరు స్పాట్లో మృతి...!

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండలంలోని జగన్నాథ్పల్లి శివారులోని నేషనల్ హైవేపై బుధవారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న కంటైనర్ను బైక్ ఢీకొనడంతో స్పాట్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు జుక్కల్ మండలం మహమ్మదాబాద్ వాసి వెంకట్ (21), మరోకరు బిచ్కుందకు చెందిన నవీన్ (21)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన గణేశ్ను మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1
88 views