
రెడ్డి సామాజంపై అసత్య ఆరోపణలపై ఆగ్రహం
– బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్...
ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం – ఉమ్మడి కర్నూలు జిల్లా
కర్నూలు, జూలై 2, AIMA మీడియా, ఆర్ ఎన్ రెడ్డి:
రెడ్డి సామాజంపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలతో కూడిన దుష్ప్రచారం జరుపుతున్నవారిపై *ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం* తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సంఘం *రాష్ట్ర అధ్యక్షులు బిర్రు ప్రతాపరెడ్డి* గారు స్పందిస్తూ, రాష్ట్రంలో సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఇటువంటి కుట్రలను సహించబోమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, ఈరోజు సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో *జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీధర్ రెడ్డి* గారి అధ్యక్షతన కీలక వినతిపత్రాలు అందజేయడం జరిగింది:
🔹 *కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి. నవ్య గారికి* వినతిపత్రం
▪︎ అసత్య ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
▪︎ సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరారు
🔹 *కర్నూలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) శ్రీ బాబు ప్రసాద్* గారికి ఫిర్యాదు
▪︎ *విభజనకర కరపత్రాలపై పోలీసు శాఖ స్పందించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్*
🔹 *ప్రచారంలో RSS పేరును అనవసరంగా లాగడం* ,
▪︎ *రెడ్డి సామాజాన్ని హిందూ విరుద్ధ శక్తిగా చిత్రీకరించడం* ,
▪︎ *కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలపై సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది* .
🔹 *రెడ్డి సామాజానికి చెందిన అనేకమంది RSS కార్యకర్తలు, నేతలు ఉన్నారని* ,
*ఈ దుష్ప్రచారం వారి మనోభావాలను గాయపరుస్తోందని సంఘం నేతలు పేర్కొన్నారు* .
🔹 *రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సమరసతకు భంగం కలిగించే ఇటువంటి దుష్ట శక్తులను చట్టపరంగా నిలువరించాలని డిమాండ్ చేశారు* .
🔸 అధికారులను కలిసిన ప్రతినిధి బృందం సభ్యులు:
తూముకుంట ప్రతాపరెడ్డి, ఇన్నెం రజనీకాంత్ రెడ్డి, రాధా రెడ్డి, సింగం సోమశేఖర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురారెడ్డి, మధుసూధన రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, వినీష్ రెడ్డి, చల్లా శేషు రెడ్డి, కోట్ల తిమ్మారెడ్డి, శేఖర్ రెడ్డి, రాంకీ కిషోర్ రెడ్డి, నాగిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం..9949734264