logo

కౌలు రైతులు తప్పనిసరి కౌలు గుర్తింపు కార్డు పొందాలి: ఏవో ప్రమీల.

నంద్యాల జిల్లా/ దొర్నిపాడు(AIMA MEDIA):
దోర్నిపాడు మండలంలోని గుండుపాపల గ్రామం నందు పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారిణి ప్రమీల అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశంలో ఏ.ఓ మాట్లాడుతూ భూమి లేని రైతులు తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డు పొందాలని తెలిపారు..ఈ గుర్తింపు కార్డు ద్వారా ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నష్టం జరిగితే నష్టపరిహారం పొందవచ్చు. మరియు మద్దతు ధరకి పంటలను విక్రయించ వచ్చు మరియు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కౌలు రైతులు పంట సహాయం పొందవచ్చు... కావున కౌలు రైతులు తప్పని సరిగా కౌలు కార్ట్ ను సంబంధిత వి.ఆర్.ఓ ద్వారా పొందగలరని తెలిపారు.. మరియు మట్టి ఆదారంగా ఎరువులను ఉపయోగించుకోవాలని తెలిపారు .. మరియు పంట నమోదు తప్పని సరిగా చేయించుకోవాలి తెలిపారు. కార్యక్రమంలో ఏ.ఓ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

0
0 views