
పరిశుభ్రతను పాటిద్దాం_డెంగ్యూ వ్యాధిని తరిమికొడదాం
అలమండ పీహెచ్ సి లో డెంగ్యూ వ్యాధి నిర్మూలన అవగాహన ర్యాలీ
జామి: డెంగ్యూ వ్యాధిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా సీజన్ వ్యాధులతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధిని కూడా నివారించవచ్చని అలమండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ బి. శిరీష డాక్టర్ వినీత విగ్నేష్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన కల్పించడానికి మే16వ జాతీయ డెంగ్యూ దినోత్సవం గా పాటిస్తారనిఏడిస్ దోమలు పగటిపూట కుట్టడం వలన వెక్టార్ ద్వారా సంతానోత్పత్తి చేసి వైరల్ వ్యాధి అని డెంగ్యూ ప్రాణాత్మక వ్యాధి అని దీనిని తగు జాగ్రత్తలతో నివారించవచ్చని తెలిపారు. పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత ను పాటించడం వలన డెంగ్యూ దోమల అభివృద్ధిని నివారించవచ్చు అన్నారు. డెంగ్యూ జ్వరం వలన వచ్చే సూచనలు అధిక జ్వరం తలనొప్పి కాళ్లు కండరాల్లో నొప్పి దురదలు వంటి ఫ్లూ లాంటి లక్షణాలు కలిగిస్తుందని మనిషిని బాగా బలహీన పరుస్తుందిని తెలిపారు. అనంతరం గ్రామంలో దోమల నివారణకు చర్యలు తీసుకోండి డెంగ్యూ వ్యాధిని తరిమి కొట్టండి. ఆరోగ్యంగా జీవించండి అని నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంఈఓ లు పీహెచ్ఎన్ మరియు ఎంపీహెచ్ఎస్ ఎంపీహెచ్ఏ(మెయిల్) హెచ్ వి
ముత్యాలమ్మ ఆశ వర్కర్లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.