logo

బొలెరోను ఢీకొట్టిన గూడ్స్‌

దత్తిరాజేరు మండలం మరడాం సమీపంలో మంగళవారం రాత్రి బొలెరోను గూడ్స్‌ ఢీకొట్టింది.
రైల్వే ట్రాక్‌ పక్కన బొలెరోను పెట్టి కూరగాయలు ఎక్కిస్తున్నారు. వ్యాన్‌ నిలిపిన చోట బురద ఉండడంతో జారి ట్రాక్‌ అంచుకు వెళ్లింది. ఆ సమయంలో విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళుతున్న గూడ్స్‌ ట్రైన్‌ బొలెరో వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాన్‌ వెనుక భాగం కొద్దిగా డ్యామేజ్‌ అయింది. ట్రైన్స్‌ వెళ్లడానికి గంట సేపు అంతరాయం కలిగింది.

51
844 views