
దేవాదాయశాఖ భూములు అక్రమంగా ఆక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష... లక్ష రూపాయలు జరిమాన*
*దేవాదాయశాఖ భూములు అక్రమంగా ఆక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష... లక్ష రూపాయలు జరిమాన*
*చట్ట సవరణ.. వెంటనే ఆర్డినెన్స్ జారీ*
అమరావతి :
దేవదాయ శాఖ ఆస్తుల ఆక్రమణ, లీజులు, లైసెన్సుల విషయంలో నిబంధనలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూమత సంస్థలు, ఎండోమెంట్ చట్టం 1987కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణలను ఆమోదిస్తూ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. బుధవారం నుంచి ఈ ఆర్డినెన్స్ అమ లులోకి వచ్చింది. లీజులు, లైసెస్సులు, భూముల విషయంలో చట్టంలో కీలక సవ రణలు చేసింది. 2018లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కొన్ని కీలక నిబంధనలను చట్టంలో చేర్చారు. దేవదాయ శాఖకు చెందిన ఆస్తులు కాపాడేం దుకు, ఆక్రమణలను తొలగించేందుకు ఈ ఆర్డినెన్స్ను తీసుకువచ్చారు. చట్టం లోని 83వ సెక్షన్ ప్రకారం భూములు కౌలు, లైసెస్సుల కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా దేవదాయ శాఖ భూములు, షాపులు లీజుదారుల వద్దే ఉంటే దానిని ఆక్రమణగా పరిగణిస్తారు. ఈవో లేదా అసిస్టెంట్ కమిషనర్ లేదా పై అధికారి స్పందించి అలాంటి వారికి వెంటనే ఖాళీ చేయమని వారం రోజుల గడు వుతో ముందుస్తు నోటీసు జారీ చేయవచ్చు. అప్పటికీ అధికారులకు ఆస్తులు అప్పగించకపోతే వెంటనే పోలీస్ ల సహకారం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం కల్పించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అత్యధికంగా ఐదేళ్లు నుంచి మూడేళ్లు పాటు జైలు, లక్ష జరిమానా విధించేలా చట్టంలో మార్పులు చేశారు. సదరు ఆస్తులకు సంబంధించి ఏదైనా దస్తావేజులు సమకూ ర్చినా ఆక్రమణలుగానే పరిగణించి చర్యలు తీసుకుంటారు. దేవదాయశాఖ ఆస్తుల్లో అనధికార నిర్మాణాలు చేపట్టరాదు. అలాంటి వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన 15 రోజుల్లోగా ఎండోమెంట్ ట్రైబ్యునల్లో అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అక్కడ అప్పీలు పెండింగ్లో ఉన్న సమయంలో ట్రైబ్యునల్ సదరు ఆస్తికి సంబంధించిన అద్దెను లేదా ఇతర మొత్తాలను డిపాజిట్ చేసేలా ఆక్రమణదారులను ఆదేశించే అధికారం ట్రిబ్యునల్ కు ఇచ్చారు.