logo

శ్రీ కొత్తూరు సుబ్బరాయుడు హుండీ ఆదాయం రూ. 25,03,320.

నంద్యాల జిల్లా /పాణ్యం (AIMA MEDIA ):
పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలసిన ప్రముఖ క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం నందు నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి హరిశ్చంద్రారెడ్డి పర్యవేక్షణలో ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీ సోమవారం దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ. 25, 03, 320 నగదు, 8 గ్రాముల 600ల మిల్లీగ్రాముల బంగారు, 830 గ్రాముల వెండి ఆదాయం చేకూరినట్లు ఈఓ తెలిపారు. మార్చి నెల 28 నుంచి జూన్ 30వ తేదీ సోమవారం వరకు రాబడి వచ్చినట్లు తెలిపారు. శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు, ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో అలాగే దేవస్థానంలో భక్తులు సమర్పించిన మిశ్రమ బియ్యం, సన్నబియ్యం, లావుబియ్యం విక్రమ బహిరంగ వేలం నిర్వహించినట్లు తెలిపారు. సన్నబియ్యం కిలో రూ.34లు, లావు బియ్యం కిలో రూ.18లు, మిశ్రమ బియ్యం కిలో రూ.21ల ప్రకారం అహోబిలానికి చెందిన నాగశే షుడు హెచ్చుపాట పాడి సన్నబియ్యం, లావు బియ్యం దక్కించుకున్నా డన్నారు. మిశ్రమ బియ్యాన్ని చంద్రశేఖరరెడ్డి దక్కించుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణారెడ్డి, అర్చకులు వీరయ్య స్వామి, నంద్యాల సేవాసమితి మహిళలు బాలాజీ సేవా ట్రస్ట్,తిరుమల బాలా సేవా సమితి, నిర్వాహకులు వై సీతారామిరెడ్డి మరియు ఆర్గనైజర్ వై శివమ్మ ఆధ్వర్యంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో 50 మంది సేవకులు పాల్గొన్నారు.

6
579 views