విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, త్రాగునీరు సరఫరాకు లైన్ క్లియర్ : ఏఈ వెంకట్ రామ్ రాజ్
రేగిడి పంపు హౌస్ వద్ద విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది.సారధి ట్యాంకు పరిధిలో గల వార్డులకు వెంటనే నీటి సరఫరా ఒంటి గంట సమయానికి చేస్తామని మున్సిపల్ ఏఈ వెంకట రామ్ రాజ్ తెలిపారు.మిగిలిన ట్యాంకులకు కూడా రేగిడి నుంచి నీరు పంపింగ్ జరుగుతోందన్నారు.
ట్యాంకులు నిండిన వెంటనే అన్ని ఏరియాలకు తాగునీరు అందివ్వడం జరుగుతుందన్నారు సాయంత్రం నుంచి ట్యాంకుల వారీగా వార్డులకు నీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రజలు గమనించి సహకరించాలని ఏఈ వెంకట్ రామ్ రాజ్ కోరారు.