logo

*కోలాటం, గజ్జల పూజ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణమూర్తి రెడ్డి*

*కోలాటం, గజ్జల పూజ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణమూర్తి రెడ్డి*
చిత్తూరు, స్వర్ణ సాగరం, జూన్ 29 కడప జిల్లా, బయనపల్లె లో కోలాటం, గజ్జల పూజ మహోత్సవం అంగరంగ వైభవంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిపాల మండలానికి చెందిన సిహెచ్ 9టీవీ అధినేత కృష్ణమూర్తి రెడ్డి ని ఆహ్వానించడం జరిగినది. ఉదయం 8 గంటలకు గణపతి పూజ,కంకణ పూజ, కలిశం పూజ నిర్వహించడం జరిగినది.తరువాత ప్రారంభమైన కోలాట కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు తన్మమ్మయం తో నృత్యాలను చేశారు.అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగినది.సాయంత్రం గజ్జల పూజ అంగరంగ వైభవంగా చేయడం జరిగినది, అనంతరం కోలాట బృందాలతో వివిధ పాటలకు నృత్యాలను ప్రదర్శించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిహెచ్ 9 టీవీ అధినేత కృష్ణమూర్తి రెడ్డి ని గజమాలతో సత్కరించడం జరిగినది. కృష్ణమూర్తి రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన కమిటీ మెంబర్లకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాకారుల మీద నాకు ఉన్నటువంటి ఆసక్తి మేరకు కళాకారులకు తగిన సహాయ, సహకారాలు అందిస్తూ ఉన్నానని.. ఇలాగే ఎల్లప్పుడూ కళాకారులకు సహాయ సహకారాలు అందిస్తానని, ప్రతి సంవత్సరం ఇలాగే కళాకారులకు కోలాటం నేర్పిస్తూ కళాకారులను రాబోయే తరాలు గుర్తించుకునేలా ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులను కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి కోలాట గజ్జల పూజ కమిటీ మెంబర్లు, పరిసర గ్రామ ప్రజలు, కోలాట బృందాలు, దూర ప్రాంతం నుంచి ప్రజలు హాజరైనారు.

27
627 views