నేడు ఆంద్రప్రదేశ్,తెలంగాణలో వర్షాలు.
విజయనగరం: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనo కారణంగా ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం. అల్లూరి, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ లో కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.