logo

ముగిసిన మహిళా సర్పంచుల మూడు రోజుల శిక్షణా కార్యక్రమం

అరకులోయ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నుండి నిర్వహిస్తున్న మహిళా సర్పంచ్ ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం తో ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళా సర్పంచులకు ఆట పాటలతో మాస్టర్ ట్రైనర్లు శిక్షణ అందించారు. ఈ శిక్షణ ద్వారా పంచాయితీలో సమస్యల పరిష్కారానికి, పలువురితో మాట్లాడే విధానంపై అవగాహణ కల్పించినట్లు పలువురు మహిళ సర్పంచులు తెలిపారు. అయితే ఈ శిక్షణ నాలుగేళ్ల ముందు నిర్వహిస్తే మహిళా సర్పంచ్ లకు ఉపయోగపడేదని వారు భావించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ లవరాజు పర్యవేక్షించారు.

2
47 views