logo

అంగన్వాడీ సేవలకు ఈ కేవైసీ తప్పనిసరి : అరకు సీడీపీఓ

అంగన్వాడీ సేవలను లబ్దిదారులు పొందడానికి ఈ కేవైసి నమోదు తప్పనిసరి అని అరకులోయ సిడిపిఓ శారద తెలిపారు. ఈ మేరకు శనివారం మండలంలోని లోతేరు అంగన్వాడీ-1 కేంద్రంలో ఈ కేవైసి నమోదు క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకు హాజరైన కిక్కిటిగూడ, తోడుబందా, ఆడారి, కాగువలస, పెదవలస, బొరకలవలస, గ్రామాల అంగన్వాడీ లబ్ధిదారులతో అంగన్వాడీ కార్యకర్తలు ఎల్ బి లక్ష్మీ, భవాని, నిర్మల, మొర్రిగుడ లక్ష్మి ఈ కేవైసి చేయించారు. ఈ ప్రక్రియను సీడీపీఓ దగ్గరుండి పర్యవేక్షించారు.

0
186 views